Share News

Anil Kumar Yadav: వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:13 PM

క్వార్ట్జ్ కుంభకోణం కేసు విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ అక్రమాలు బయటపడ్డాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్థన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Anil Kumar Yadav: వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
Anil Kumar Yadav

నెల్లూరు: క్వార్ట్జ్ కుంభకోణం కేసు (Quartz scam Case) విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) భారీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్థన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో క్వార్ట్జ్ కుంభకోణంలో కీలక వ్యవహారాలని శ్రీకాంత్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో అనిల్ కుమార్ బ్యాచ్ వేల కోట్ల రూపాయల్లో మామూళ్ల వసూళ్లుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.


అనుమతులు లేకపోయిన టన్ను క్వార్ట్జ్‌కి రూ.7 వేల నుంచి రూ.10వేలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది‌. ఇలా సంపాదించిన అక్రమ సొమ్ముతో మాజీ మంత్రి అనిల్ కుమార్ భాగస్వామ్యంతో పలుచోట్ల స్థిరాస్థి వ్యాపారాలు నిర్వహించాడు శ్రీకాంత్ రెడ్డి. క్వార్ట్జ్ అక్రమ సొమ్ముతో భారీగా భూములు కొనుగోలు చేసి వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. గూడూరు, చెన్నూరు రోడ్డులో వంద ఎకరాల భూమిలో గ్రీన్ మెడోస్ పేరుతో రియల్ వెంచర్ ఏర్పాటు చేశారు. అలాగే నాయుడుపేట హైవే వెంట 50 ఎకరాల్లో స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతో రియల్ వెంచర్‌కి తెరదీశారు. హైదరాబాద్‌లోని మణికొండ అల్కాపురి వద్ద హెవెన్లీ హోమ్స్ పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అలాగే తుర్కయాంజల్ వద్ద గ్రీన్ మెడోస్ హౌసింగ్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి ఎమోషనల్.. మద్యం వ్యాపారంపై తండ్రి చెప్పినట్టు..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 22 , 2025 | 06:26 PM