Maoist Party Bandh: మరోసారి బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:17 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్‌ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఛత్తీస్‌గడ్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20వ తేదీన బంద్‌కు మావోయిస్ట్ పార్టీ (Maoist Party Bandh) పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్‌ని (Operation Kagaar) నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మే 21వ తేదీన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ని నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాలని మావోయిస్టులు భావించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నంబాల, గౌతమ్, భాస్కర్‌లని పోలీస్ భద్రత బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లలో కోల్పోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఇవాళ(ఆదివారం) లేఖ విడుదల చేశారు.
కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి మావోయిస్టులని పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టులపై చర్యలు చేపట్టారు. పోలీసు భద్రత బలగాలు ఎక్కడికక్కడ మావోయిస్టులను అడ్డుకుంటున్నారు. ఇటీవల చత్తీస్‌గడ్, తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతిచెందారు. కీలక నేతలను కోల్పోవడంతో మావోయిస్టు పార్టీ క్రమంగా పట్టు కోల్పోతుంది.
ఇదివరకే భారతదేశ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ నేతలు బంద్ చేపట్టారు. మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంద్ చేపట్టి తమ పట్టు నిలుపుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారు. ఇందులో భాగంగనే జూన్ 20వ తేదీన బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు శాంతి చర్చలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు
19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో
For More AP News and Telugu News