Muniseshi Reddy: టీడీపీలో విషాదం.. సీనియర్ నేత కన్నుమూత
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:12 AM
తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు.
నంద్యాల, నవంబరు16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఆయన సన్నిహితులు.
పాణ్యం మండలంలోని నూలు మిల్లుకు చైర్మన్‌గా, నంద్యాల సమితి ప్రెసిడెంట్‌గా పని చేశారు ముని శేషిరెడ్డి. ఆయన మృతిపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వెంకటరెడ్డి దంపతులు సంతాపం వ్యక్తం చేశారు. మునిశేషిరెడ్డి మృతితో తెలుగు తమ్ముళ్లు కంటతడి పెట్టుకున్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడుతున్నారు. మునిశేషిరెడ్డి మృతిపై టీడీపీ హై కమాండ్ సంతాపం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. మునిశేషిరెడ్డి భౌతిక కాయన్ని పార్టీ నేతలు సందర్శించి నివాళి అర్పిస్తున్నారు. వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News