AP CM Srisailam visit: శ్రీశైలంలో గంగాహారతి.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Jul 07 , 2025 | 07:19 PM
CM Chandrababu Srisailam Project Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం నిర్వహించనున్న జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న జలహారతి కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువ ఉన్న నాగార్జునసాగర్ కు నీళ్లు విడుదల చేసే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం లేదా బుధవారం శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకి ఆహ్వానం పంపారు. గంగాహారతి కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనున్నారు.
జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీఎత్తున వరదనీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) నిండుకుండలా జలకళతో తొణికిసలాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఇప్పటికే 880 అడుగులకు చేరుకుంది. 215 టీఎంసీలకు గాను193 టీఎంసీలు ఉంది. దీంతో మంగళవారం అధికారికంగా గేట్లు ఎత్తేందుకు ప్రాజెక్ట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా గేట్లు ఎత్తిన తర్వాత కృష్ణమ్మకు చీరసారెలు సమర్పిస్తారు. ఉదయం నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు సహా స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు.
సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..
మంగళవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు శ్రీశైలం సమీపంలోని సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11 నుంచి 11:35 మధ్య స్వామీఅమ్మవార్లను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత 11:50 నుంచి 12:10 వరకూ శ్రీశైలం జలాశయం వద్ద జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 12:25 నుంచి 1:10 వరకూ నీటి వినియోగదారుల సంఘంతో సమావేశమవుతారు. అనంతరం 1:30 గంటలకు తిరిగి సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అమరావతికి హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో భూముల రిజిస్ట్రేషన్..
For More AndhraPradesh News And Telugu News