Share News

MP Shabari: చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమి కొడతారు.. జగన్‌కి ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:11 PM

జగన్ ఐదేళ్లలో చేయని అభివృద్ధి.. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే చేసి చూపించామని తెలుగుదేశం ఎంపీ బైరెడ్డి శబరి ఉద్ఘాటించారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించామని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.

MP Shabari: చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమి కొడతారు.. జగన్‌కి ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్
Nandyal MP Byreddy Shabari

నంద్యాల: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి (Nandyal MP Byreddy Shabari) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇవాళ(బుధవారం) నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. దామగట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, తెలుగుదేశం నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ఏమి చేశారో జగన్ ప్రజలకు చెబితే బాగుంటుందని పేర్కొన్నారు ఎంపీ బైరెడ్డి శబరి.


అలా కాకుండా చిల్లర రాజకీయాలతో పాదయాత్ర చేస్తే జనం చెప్పులతో కొడతారని ఎంపీ బైరెడ్డి శబరి హెచ్చరించారు. జగన్ ఐదేళ్లలో చేయని అభివృద్ధి.. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే చేసి చూపించామని ఉద్ఘాటించారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించామని వెల్లడించారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.


సీబీఐ సోదాలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

కదిరిలో సీబీఐ సోదాలపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పర్యటించారు. కదిరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట మీడియాతో మాట్లాడారు. కదిరిలో వైసీపీ నేతలపై సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నారంటే వైసీపీ నాయకుల పరిస్థితి ఏమిటో జగన్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా 33 చోట్ల సీబీఐ సోదాలు చేస్తోందంటే వైసీపీ నాయకులు ఏ పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నారో జగన్ తెలుసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో వైసీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. తప్పుడు మనుషులు కాబట్టే సీబీఐ అధికారులకు సమాధానం చెప్పకుండా పారిపోయారని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం

రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

For More AP News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 12:22 PM