TG Bharath: నాపై దుష్ప్రచారం.. సాక్షి మీడియాపై కేసు వేస్తా
ABN , Publish Date - Apr 20 , 2025 | 12:14 PM
Minister TG Bharath: సాక్షి మీడియాపై మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో సాక్షిపై కేసు వేస్తానని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు.

కర్నూలు : తనపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ, జగన్ మూసుకోవాల్సిందేనని చెప్పారు. ఇవాళ(ఆదివారం) సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా అక్షయ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ నాగరాజు, పార్టీ నాయకులు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఓ విజనరీ లీడర్ అని.. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. చంద్రబాబు 2019 నుంచి 2024 వరకూ సీఎంగా కొనసాగి ఉంటే సింగపూర్, దుబాయ్‌లా ఏపీ ఉండేదని అన్నారు. చంద్రబాబు బ్రాండ్‌పైనే రాష్ట్రానికి సుమారు రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు పదినెలల్లోనే వచ్చాయని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Megastar Chiranjeevi: సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబుకు గవర్నర్, పవన్ జన్మదిన శుభాకాంక్షలు
Narayana Team: గుజరాత్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన
AP High Court: అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆదేశించలేం
For More AP News and Telugu News