Share News

Jagan High Court: సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో జగన్‌కు రిలీఫ్

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:34 PM

Jagan High Court: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. రెండు వారాల వరకూ తదనంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Jagan High Court: సింగయ్య మృతి కేసు.. హైకోర్టులో జగన్‌కు రిలీఫ్
Jagan High Court

అమరావతి, జులై 1: సింగయ్య మృతి ఘటనలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy), ఇతరులపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెండు వారాలపాటు స్టే విధించింది. ఈ కేసులో రెండు వారాల పాటు తదనంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. తమ వద్ద ఉన్న వీడియో ఆధారాలు, ఇతర సాక్ష్యాలు కోర్ట్ ముందు ఉంచేందుకు రెండు వారాలు సమయం కావాలని కోర్టును అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఇప్పటికే ఈ కేసును బీఎన్‌ఎస్ కింద 105 సెక్షన్‌కు మార్చారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. అందువల్ల తదనంతర చర్యలు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోర్టును జగన్ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో రెండు వారాల పాటు తదనంతర చర్యలపై హైకోర్టు స్టే విధించింది.


కాగా, ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు. జగన్ ప్రయాణిస్తున్న కారు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. తొలుత జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడు చనిపోయాడని వార్తలు వచ్చినప్పటికీ నాలుగు రోజుల తర్వాత జగన్ కారు కిందే సింగయ్య పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో జగన్‌ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టును జగన్ ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రెండు వారాలపాటు స్టే విధించింది.


ఇవి కూడా చదవండి

సీఎం హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్.. ఏం జరిగిందంటే

పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో నడుచుకున్నా: పురందేశ్వరి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 04:36 PM