Share News

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:34 PM

తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Pedda Reddy And JC Prabhakar Reddy

అనంతపురం: తాడిపత్రిలో పొలిటికల్ హీట్ నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి 'ముండమోపి రాజకీయాలు' చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నాడని పెద్దారెడ్డి సీరియస్ కామెంట్స్ చేయగా నేడు అదే దీటుగా జేసీ ప్రభాకరరెడ్డి విమర్శించారు. పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.


ఉమ్మడి జిల్లాలో వైసీపీ నేతలతో సన్నిత సంబంధాలు ఉన్నాయని, అయితే.. గతంలో జరిగిన విషయాలని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. మోటర్ వెహికల్ యాక్ట్ పెట్టి నన్ను జైలుకు పంపారు.. పైనుంచి చెప్పారంటూ గత ఐదేళ్లలో అధికారులు నన్ను ఇబ్బంది పెట్టారని జేసీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పెద్దారెడ్డి వెంట వస్తున్న నాయకులు గత ఐదేళ్లలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు.


పెద్దారెడ్డి ఇంటికి రిజిస్ట్రేషన్ కూడా లేదు... అన్ని అక్రమాలే అంటూ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి లేకపోతే పెద్దారెడ్డి జీరో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ముండమోపినే.. పెద్దారెడ్డి .... మరి నువ్వు ఏమిటో తెలుసుకుని మాట్లాడు అంటూ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

సిట్ కస్టడీకి చెవిరెడ్డి.. జైలు వద్ద హల్‌చల్

ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు వానలే వానలు..

Read Latest AP News

Updated Date - Jul 01 , 2025 | 12:55 PM