Home » JC Prabhakar Vs Pedda Reddy
జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాను ఏనాడూ దూషించలేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలు అబద్దపు ప్రచారమేనని పేర్కొన్నారు.
Pedda Reddy Vs Police: తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఈరోజు ఆయన తాడిపత్రి పర్యటనకు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో చేసేది ఏమిలేక తన పర్యటనను పెద్దారెడ్డి వాయిదా వేసుకున్నారు.
పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రిలోకి రానివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దారెడ్డి పెద్ద కొడుకు ఒక రోగ్ అని, తాడిపత్రిని దోచేసి నాశనం చేశారంటూ మండిపడ్డారు.
తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పెద్దారెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్దారెడ్డి ఇంటిపై దాడికి జేసీ ప్రభాకర్ రెడ్డి బయల్దేరడంతో ఆందోళన నెలకొంది.
JC Prabhakar Reddy: తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది. వైసీపీ హయాంలో తనను అన్యాయంగా జైలుకు పంపించారని జైసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉందని అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి ఏబీఎన్ రిపోర్టర్ రమణను కాల్చేస్తానంటూ గన్ తీసి వైసీపీ నేత కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి హల్‌చల్ చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ మరుసటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో భద్రతకు వచ్చిన పోలీసులకు చుక్కలు కనపడుతున్నాయ్..