Share News

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రికి రానివ్వడం లేదు.. ఆయన కొడుకు ఒక రోగ్‌

ABN , Publish Date - Jul 02 , 2025 | 01:51 PM

పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రిలోకి రానివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దారెడ్డి పెద్ద కొడుకు ఒక రోగ్‌ అని, తాడిపత్రిని దోచేసి నాశనం చేశారంటూ మండిపడ్డారు.

JC Prabhakar Reddy: పెద్దారెడ్డిని ప్రజలే తాడిపత్రికి రానివ్వడం లేదు.. ఆయన కొడుకు ఒక రోగ్‌

- రికార్డులు, ఆధారాలూ పంపుతా.. చూడండి

- నాపై, నా కొడుకుపై అనేక అక్రమ కేసులు పెట్టారు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం: పెద్దారెడ్డి(Pedda Reddy)ని ప్రజలే తాడిపత్రిలోకి రానివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) పేర్కొన్నారు. పెద్దారెడ్డి పెద్ద కొడుకు ఒక రోగ్‌ అని, తాడిపత్రిని దోచేసి నాశనం చేశారంటూ మండిపడ్డారు. గత ఐదేళ్లు తనపై, తన కొడుకుపై కేసులు పెట్టి జైళ్లకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవర్‌ ఉంటే జుట్టు, లేకుంటే కాళ్లు పట్టుకునే చందంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.


బుధవారం ఆయన అనంతపురంలోని తన గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ(YCP) నేతలకు తాను వ్యతిరేకం కాదన్నారు. నాడు తన అన్న దివాకర్‌ రెడ్డి(Divakar Reddy) శిష్యులుగా ఉన్న వారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారన్నారు. గత ఐదేళ్లలో చట్టాలను పక్కన బెట్టి తమపై కేసులు పెట్టారన్నారు. తనను 130 రోజులు, తన కొడుకు జేసీ అశ్మిత్‌ రెడ్డిని 75 రోజులు జైల్లో పెట్టారన్నారు. గత ఐదేళ్లలో కేతిరెడ్డి పెద్దారెడ్డి చేయని అరాచకం లేదన్నారు. తన ఉన్న ఇళ్లు 6 సెంట్లు ఫ్రాడ్‌ చేసి రిజిస్ట్రర్‌ చేయించారని, కోటమికుంట్లలో వందల ఎకరాల భూ అక్రమాలు జరిగాయన్నారు.


రైతులు సోలార్‌కు ఇస్తే... వాటిని కన్వర్షన్‌ చేసిన తర్వాత కూడా అక్రమంగా పాసు పుస్తకాలు చేశారంటూ మండిపడ్డారు. తనకు గన్‌మెన్‌ కూడా లేరన్నారు. పెద్దారెడ్డి ప్రైవేటు గన్‌మెన్‌ను కూడా పెట్టుకున్నాడన్నారు. తననెవరూ చంపలేరనీ, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న పెద్దారెడ్డి ట్రై చేసేలా ఉన్నాడన్నారు. సూర్యప్రతాప్‌రెడ్డి లేకుంటే.. పెద్దారెడ్డి జీరో అన్నారు.


pandu3.2.jpg

తనను ముండమోపి అంటూ పెద్దారెడ్డి అంటున్నారనీ, ఆయన ఏ జెండర్‌ కూడా తెలియడం లేదన్నారు. ఆయన డాంకీ, క్రాస్‌ బ్రీడ్‌లా ఉంటాడనీ, అలాగే తింటాడంటూ ఎద్దేవా చేశారు. పెద్దారెడ్డి సారా కూడా కాచారని, ఇసుక అమ్మడంతోపాటు అనేక అక్రమాలు చేశాడన్నారు. తనకు ఆ అవసరం లేదనీ, మీసం మెలేసి బతుతున్నానంటూ మీసం తిప్పుతూ తెలియజేశారు. పెద్దారెడ్డికి ఇదే లాస్ట్‌ వార్నింగ్‌ అంటూ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 01:51 PM