Share News

Pedda Reddy Vs Police: తాడిపత్రిలో హైటెన్షన్.. వెనక్కి తగ్గిన పెద్దారెడ్డి!

ABN , Publish Date - Jul 15 , 2025 | 10:38 AM

Pedda Reddy Vs Police: తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఈరోజు ఆయన తాడిపత్రి పర్యటనకు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో చేసేది ఏమిలేక తన పర్యటనను పెద్దారెడ్డి వాయిదా వేసుకున్నారు.

Pedda Reddy Vs Police: తాడిపత్రిలో హైటెన్షన్.. వెనక్కి తగ్గిన పెద్దారెడ్డి!
jc prabhakar reddy peddareddy

తాడిపత్రి (జులై 15): తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Pedda Reddy) మరోసారి తాడిపత్రి (Tadipatri) వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ (NDA Alliance) ఇచ్చిన హామీలపై నిలదీసేందుకు రీకాలింగ్ చంద్రబాబు (CM Chandrababu) మేనిఫెస్టో కార్యక్రమాన్ని అక్కడి వైసీపీ (YCP) శ్రేణులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను కోరారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి (Anantha Venkatarami Reddy)సైతం ఆ జిల్లా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లేఖ రాశారు. కాగా గతంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన క్రమంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆయన్ను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.


మీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి..!

కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రికి రావొద్దని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి నోటీసులు అందించారు. ఇవాళ తాడిపత్రిలో మంత్రుల ప్రొగ్రాం ఉందని.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే నేపథ్యంలో వైసీపీ నేతలు తమ సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 18 లేదా ఆ తర్వాత కార్యక్రమం నిర్వహించుకోవచ్చని సూచించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చేసేది ఏమి లేక వెనక్కి తగ్గారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. ఈరోజు తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 18న ఈ కార్యక్రమాన్ని జరుపుతామని అన్నారు.


తాడిపత్రికి జేసీ..!

తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy), వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వైరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. వారిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే అంటుకునే విధంగా ఉంది. కాగా ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారు అన్న సమాచారాన్ని విహార యాత్రలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి అక్కడి టీడీపీ కార్యకర్తలు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన హుటాహుటిన ప్రత్యేక విమానంలో విహారయాత్ర నుంచి తాడిపత్రి బయలుదేరినట్లు సమాచారం. ఒకవేళ పెద్దారెడ్డి తన తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకొనిపోయుంటే అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకుని ఉండేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

యువతి మోజులో పడి భర్త వేధింపులు ఉరివేసుకొని భార్య ఆత్మహత్య

Updated Date - Jul 15 , 2025 | 10:46 AM