Srinivasa Verma: డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:56 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేసేలా పీవీఎన్ మాధవ్ చూడాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు. కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడి..వారి సమస్యలు పరిష్కరించేలా మాధవ్ పని చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సూచించారు.

విజయవాడ: డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ (Union Minister Srinivasa Verma) వ్యాఖ్యానించారు. కూటమి నేతలతో సమన్వయం చేస్తూనే.. ఏపీ బీజేపీని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మనం ఐదు శాతం సీట్లు తీసుకోవడం కాదని.. మనమే మరో పార్టీకి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. ఇవాళ(మంగళవారం) విజయవాడ బీజేపీ కార్యాలయంలో శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడారు. ఏపీ బీజేపీ రథసారథిగా ఎంపికైన పీవీఎన్ మాధవ్‌కు శ్రీనివాస వర్మ శుభాకాంక్షలు తెలిపారు.
పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పార్టీ కోసం ఎంతో పని చేశారని శ్రీనివాస వర్మ కొనియాడారు. తాను ఎంపీగా, కేంద్రమంత్రిగా పురంధేశ్వరి సహకారంతో ఎదిగానని ఉద్ఘాటించారు. పీవీఎన్ మాధవ్ కూడా నిత్యం పార్టీ కోసం పని చేస్తారని అన్నారు. మాధవ్ తండ్రి చలపతిరావు కూడా పార్టీ కోసం పరితపించే వారని గుర్తుచేసుకున్నారు.
ఇప్పటి నాయకులకు చలపతిరావు సేవల గురించి తెలియదని చెప్పారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి చలపతిరావే అని గుర్తుచేసుకున్నారు. ఆ కుటుంబం నుంచి వచ్చిన మాధవ్ కూడా సొంతంగా ఎదిగారని కొనియాడారు. మాధవ్ ఏపీ బీజేపీని బలోపేతం చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఉద్ఘాటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేసేలా పీవీఎన్ మాధవ్ చూడాలని కోరారు. కింది స్థాయి కార్యకర్తలతో మాట్లాడి.. వారి సమస్యలు పరిష్కరించేలా మాధవ్ పని చేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సూచించారు.
ఇవి కూడా చదవండి:
రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More AP News and Telugu News