Share News

CM Chandrababu Helicopter: సీఎం హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:36 PM

CM Chandrababu Helicopter: వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో సీఎం ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు.

CM Chandrababu Helicopter: సీఎం హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్.. ఏం జరిగిందంటే
CM Chandrababu Helicopter

అమరావతి, జులై 1: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈరోజు (మంగళవారం) తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం పంపిణీ చేయాల్సి ఉంది. అక్కడకు వెళ్లి గ్రామసభల్లో పాల్గొనడంతో పాటు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేడు ఉండవల్లిలోని నివాసం నుంచి తూర్పుగోదావరి జిల్లా కాపవరం వెళ్లి అక్కడి నుంచి నేరుగా మలకపల్లి వెళ్లాల్సి ఉంది.


అయితే ఉండవల్లి నుంచి బయలుదేరిన వెంటనే వాతావరణం సరిగా లేకపోవడంతో తిరిగి గన్నవరం విమానాశ్రయంలో హెలికాఫ్టర్‌ను పైలెట్ ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. తరువాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు రాజమండ్రికి వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మలకపల్లికి వెళ్లనున్నారు సీఎం.


కాగా.. విజయవాడ, ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఆకాశం మొత్తం మేఘావృతం అయి ఉండటంతో పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సమాచారం అందింది. అదే విధంగా ఐఎండీ నుంచి సమాచారం అందడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరే సమయంలోనే వాతావరణానికి సంబంధించి పైలెట్ కొంత అనుమానించినప్పటికీ టేకాఫ్ చేశారు. కానీ హెలికాఫ్టర్ బయలుదేరిన వెంటనే వాతావరణ అనుకూలించలేదని గ్రహించిన పైలెట్ వెంటనే గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ఉండటంతో అందులోనే రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. ఆపై రోడ్డు మార్గాన మలకపల్లి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి విమానం ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని రాత్రికి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు.


ఇవి కూడా చదవండి

పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో నడుచుకున్నా: పురందేశ్వరి

సిట్ కస్టడీకి చెవిరెడ్డి.. జైలు వద్ద హల్‌చల్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2025 | 01:01 PM