Minister Satya Kumar: కూటమి ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:52 AM
కూటమి ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

విజయవాడ: వైద్యుల వృత్తిపట్ల ప్రజలు గౌరవంతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) సూచించారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పేదలకు సకాలంలో వైద్యం అందేవిధంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే వైద్య వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని వెల్లడించారు. ఇవాళ(మంగళవారం) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వివిధ హాస్పిటల్స్‌కి చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు.
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులని సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవలు అందిస్తున్న 80 వేల మంది డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్తశుద్ధితో, అంకితభావంతో పవిత్రమైన వైద్యవృత్తిని ఎంపిక చేసుకొని ఎనలేని సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్రలో ఆరోగ్య, సంపన్న, సంతోషకరమైన రాష్ట్రాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారని పేర్కొన్నారు మంత్రి సత్యకుమార్.
స్వాతంత్య్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంబరాల్లో వికసిత్ భారత్ అభివృద్ధికి చంద్రబాబు దోహదపడుతున్నారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. డాక్టర్లు కూడా ప్రజలకి సేవాభావంతో, మానవతా దృక్పథంతో ప్రజలకి సేవలు అందించాలని సూచించారు. గ్రామాల్లో కూడా వైద్యసేవలు ముమ్మరంగా అందిస్తుండటంతో ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. కొత్తగా వస్తున్న వ్యాధులపైన ఒక కమిటీని వేశామని.. ఆ వ్యాధులపై త్వరగా మెడిసిన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More AP News and Telugu News