Anganwadis: 5 వేల మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్
ABN , Publish Date - Jul 01 , 2025 | 06:27 AM
రాష్ట్రంలోని 7 వేల మినీ అంగన్వా డీ కేంద్రాలకుగాను, 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

త్వరలో వాటిలో ఆయా పోస్టుల భర్తీ: మంత్రి సంధ్యారాణి
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 7 వేల మినీ అంగన్వా డీ కేంద్రాలకుగాను, 5 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలకు మెయిన్ అంగన్వాడీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు విడుదలవుతాయని తెలిపారు. మినీ అంగన్వాడీల్లో ఇప్పటి వరకు ఒక్క కార్యకర్తలు మాత్రమే పనిచేసే వారని, ఆయాలు ఉండేవారు కాదని తెలిపారు. మినీకి మెయిన్ అంగన్వాడీ హోదా కల్పించి న తర్వాత, ఆ 5వేల మందికి పూర్తిస్థాయి అంగన్వాడీ టీచర్ హోదా ఇస్తూ చట్టబద్ధమైన వేతనాలు, విధులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ కేంద్రాల్లో అంగన్వాడీ 5 వేల మంది ఆయాల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.