Share News

IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్

ABN , Publish Date - Apr 22 , 2025 | 09:49 AM

Kadambari Jatwani case: ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురిని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. కాగా ఇవాళ ఐపీఎస్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్
IPS officer Anjaneyulu Arrest

అమరావతి: ఐపీఎస్ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను ఇవాళ(మంగళవారం) ఉదయం హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఆంజనేయులు పనిచేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ముంబై నటి జత్వాని కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నేటి వరకు బెయిల్‌కు కూడా ఆంజనేయులు న్యాయస్థానంలో పిటీషన్ వేయలేదు. మరికాసేపట్లో ఆంజనేయులను హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏపీ సీఐడీ అధికారులు తీసుకురానున్నారు.


జగన్ ప్రభుత్వంలో నటి జత్వానీను వైసీపీ నేత విద్యాసాగర్ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్నిఅరెస్ట్ చేసిన సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వాని కేసు వేయడంతోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును వాపస్ తీసుకోవాలని జత్వానీపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతి రాణాటాటా, విశాల్ గున్నిలు తీవ్ర ఒత్తిడికి గురిచేశారనే విమర్శలు వచ్చాయి.


ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసును సీరియస్‌గా విచారణ చేపట్టింది. జత్వానీ విషయంలో ముగ్గురి అధికారుల పాత్ర ఉందని తెలియడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను 2025 సెప్టెంబర్ 25వ తేదీ వరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి

Kakani Govardhan Reddy: కాకాణికి లభించని ఊరట

PM Modi Visits to Amaravati: మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 12:57 PM