Share News

TDP MP Lavu Sri Krishnadevarayalu: ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖను మరింత పటిష్టం చేస్తాం: లావు శ్రీ కృష్ణదేవరాయలు

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:40 PM

కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి చేస్తూ.. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖను మరింత పటిష్టం చేస్తున్నామని తెలుగుదేశం ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఏపీలో ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

TDP MP Lavu Sri Krishnadevarayalu:  ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖను మరింత పటిష్టం చేస్తాం: లావు శ్రీ కృష్ణదేవరాయలు
TDP MP Lavu Sri Krishnadevarayalu

విజయవాడ: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏపీకి సంబంధించి సివిల్ సప్లైతో 2017 నుంచి కలిసి పని చేస్తోందని తెలుగుదేశం ఎంపీ, ఎఫ్‌సీఐ ఏపీ చైర్మన్ లావు శ్రీ కృష్ణదేవరాయలు (TDP MP Lavu Sri Krishnadevarayalu) వెల్లడించారు. ఇవాళ(శనివారం) విజయవాడలో ఎఫ్‌సీఐ, సివిల్స్ సప్లై శాఖతో సంయుక్తంగా రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లావు శ్రీ కృష్ణదేవరాయలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావు శ్రీ కృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎక్కువభాగం ప్రొక్యూర్‌మెంట్, డిస్టిబ్యూషన్ సివిల్ సప్లై శాఖ చేస్తోందని తెలిపారు లావు శ్రీ కృష్ణదేవరాయలు.


అదనంగా ఉన్న కోటాను మాత్రం ఎఫ్‌సీఐ తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తోందని లావు శ్రీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. నేడు ఈ సమావేశంలో జీఎం, ఇతర ఉన్నతాధికారులు వివిధ అంశాలపై చర్చించారని వెల్లడించారు. ఎఫ్‌సీఐ గోడౌన్‌కు వచ్చే బియ్యం క్వాలిటీని పెంచడంతో పాటు, స్టోరేజీ కెపాసిటీ ఇప్పుడు మరింత పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఎఫ్‌సీఐ గోడౌన్స్ ఖాళీగా ఉంటే వాటిని కూడా వినియోగించుకోవాలని చెప్పారని అన్నారు. ఏపీకి ఇచ్చిన వాటా ప్రకారం ప్రొక్యూర్ చేసేదంత, బయటకు ఎంత పంపాలి అనే అంశాలపై అంచనాలు రూపొందించారని వెల్లడించారు లావు శ్రీ కృష్ణదేవరాయలు.


25లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్‌సీఐ నుంచి తీసుకునే అవకాశం ఉన్నా.. ఏపీ సివిల్ సప్లై శాఖ 10 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే తీసుకుంటుందని లావు శ్రీ కృష్ణదేవరాయలు వివరించారు. సోలార్ రూప్‌కు అవకాశం ఉన్న చోట్ల సోలార్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. 60 మెగావాట్లకు పైగా ఎనర్జీని తయారు చేసేలా సిస్టమ్‌ను సిద్దం చేశారని చెప్పుకొచ్చారు. థర్డ్ పార్టీ ద్వారా గోడౌన్లు, నిర్వహణ, రైస్ తరలిస్తున్నారని అన్నారు. థర్డ్ పార్టీ ద్వారా అమలు జరిగే తీరుపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖ ఏపీలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రైతులకు మరింత ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడం, మార్పులపై ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి చేస్తూ.. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖను మరింత పటిష్టం చేస్తున్నామని లావు శ్రీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్

Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 04:50 PM