Home » Lavu Sri Krishna Devarayalu
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈసీతో మంగళవారం ఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది. టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో ఈసీ అధికారులని టీడీపీ నేతలు కలిశారు.
కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి చేస్తూ.. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖను మరింత పటిష్టం చేస్తున్నామని తెలుగుదేశం ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఏపీలో ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై శాఖ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపించాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రైల్వే మంత్రిని కోరారు. జలంధర్, జమ్ము, కురుక్షేత్ర, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు
Operation Sindoor: పాకిస్థాన్‌లోని 9 టెర్రరిస్టుల స్థావరాలపై భారత సేనలు దాడి చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా టార్గెట్ చేధించమనేది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆల్ పార్టీ మీటింగ్‌లో వివరించారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్మీ అధికారులకు ధన్యవాదాలు తెలిపామన్నారు.
Rammohan Naidu: తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లితో సమానమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉద్ఘాటించారు. తమ కుటుంబానికి రాజకీయంగా అవకాశాలు కల్పించింది టీడీపీ మాత్రమేనని స్పష్టంచేశారు.
ఏపీలో మద్యం కుంభకోణంకు సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇదే అంశంపై నిన్న (మంగళవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని ఎంపీ లావు వివరించారు.
MP Sri Krishna Devarayalu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణలో వేలకోట్లు సంపాదించారని ఆరోపించారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి విడదల రజిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ ఇచ్చారు. రజినీ వేధింపులు ఎదుర్కొన్న స్టోన్ క్రషర్స్ సంస్థ కేసు పెడితే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి జాషువా స్టేట్‌మెంట్, ఇతర అధికారుల స్టేట్‌మెంట్‌లు కూడా ఉన్నాయన్నారు. తాను వైయస్సార్సీపి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా తాను మాట్లాడలేదని.. కానీ..
Vidadala Rajini: ఏసీబీ కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజిని స్పందించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు.