Share News

MLA Varla Kumar Raja: త్వరలోనే పేర్ని నాని జైలుకు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:46 PM

ఏపీలో అశాంతి సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆరోపించారు. త్వరలోనే పేర్ని నాని జైలుకు పోతున్నారని చెప్పుకొచ్చారు. ఆ భయంతోనే రప్ప రప్ప అనే డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు.

MLA Varla Kumar Raja: త్వరలోనే పేర్ని నాని జైలుకు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
TDP MLA Varla Kumar Raja

అమరావతి: వైసీపీ అవినీతి, దురాగతాలు రోజుకొకటి బయపడుతున్న వేళ డైవర్షన్ పాలిటిక్స్‌కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తెరలేపారని తెలుగుదేశం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా (TDP MLA Varla Kumar Raja) విమర్శించారు. ప్రశాంతమైన పామర్రులో పేర్ని నాని అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రౌడీలు, కిరాతకులు చేసే పనులకు.. పేర్ని నాని బ్యాచ్‌కు ఏం తేడా ఉందని ప్రశ్నించారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా.


ఇవాళ(సోమవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో వర్ల కుమార్ రాజా మీడియాతో మాట్లాడారు. రాత్రులు ఎవరూ దాడులు చేస్తారనే అశాంతితో పామర్రు రైతులు ఉన్నారని చెప్పుకొచ్చారు.పేర్ని నాని వ్యాఖ్యలపై, ఫోన్ సంభాషణపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో అశాంతిని సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ అమలుతో జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని అన్నారు. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందనే భయపడే పేర్ని నానితో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరదీశారని ఆక్షేపించారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా.


రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడిన పేర్ని నాని తన వ్యాఖ్యలతో కార్యకర్తలను బలితీసేందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు చేశారు. త్వరలోనే పేర్ని నాని జైలుకు పోతున్నారని చెప్పుకొచ్చారు. ఆ భయంతోనే రప్ప రప్ప అనే డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే పామర్రులో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఉద్ఘాటించారు. ఏపీని రావణకాష్టం చేసే విధంగా జగన్ రెడ్డి, పేర్ని నాని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చట్టపరంగా పేర్ని నానిని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీకి మంచి చేద్దామని సీఎం చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేస్తే... దాన్ని జగన్ రెడ్డి, పేర్నినాని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

అధికారం కోసం ఏమైనా చేస్తారు.. జగన్‌పై యనమల ఫైర్

కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్తపై కేసు నమోదు..కారణమిదే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 02:56 PM