Share News

Somireddy slams Jagan: జగన్ అలా చేస్తే మా కొంపేమి మునగదు కదా: సోమిరెడ్డి

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:53 PM

Somireddy slams Jagan: వైసీపీ నేతల ఆలోచనలే దుర్మార్గమని ఎమ్మెల్యే సోమిరెడ్డి మండిపడ్డారు. అసలు ఈ రప్పా రప్పా పార్టీ నాయకులకు ఏమైందో అర్థం కావడం లేదని.. ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.

Somireddy slams Jagan: జగన్ అలా చేస్తే మా కొంపేమి మునగదు కదా: సోమిరెడ్డి
Somireddy slams Jagan

అమరావతి, జులై 2: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) సీనియర్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (MLA Somireddy Chandramohan Reddy) మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. వైసీపీ నేతల ఆలోచనలే దుర్మార్గమని మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు ఏమైందో తెలియడం లేదన్నారు. జగన్ పరామర్శల పేరుతో ప్రాణాలు తీస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


సోమిరెడ్డి ట్వీట్..

‘అప్పుడేమో భద్రత లేదన్నారు... ఇప్పుడు పోలీసులు అనుమతిచ్చినా కోర్టుకెళ్లారు. పరామర్శల పేరుతో ప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీస్తారు. దానికి పోలీసుల వైఫల్యమని నెపం పెడతారు. జాగ్రత్తలు తీసుకుంటుంటే రాజకీయం చేస్తారు. వైసీపీ నేతల ఆలోచనలే దుర్మార్గం. అసలు ఈ రప్పా రప్పా పార్టీ నాయకులకు ఏమైందో అర్థం కావడం లేదు. ఏదో కన్ఫ్యూజన్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. నెల్లూరులో జగన్ దిగడానికి హెలిప్యాడ్‌కు ముందుగానే అనుమతులు ఇచ్చినా హైకోర్టును ఆశ్రయించడం విచిత్రంగా ఉంది. రెంటపాళ్ల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో వైసీపీ నేతలు ఎంపిక చేసిన ప్రదేశాలకు ప్రత్యామ్నాయంగా జైలుకు దగ్గరలో అనుమతి ఇచ్చారు. ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి సానుభూతి పొందడానికే హైకోర్టుకు వెళ్లినట్టుగా ఉంది. జగన్ రెడ్డి హెలికాఫ్ట‌ర్‌లో దిగితే కూటమి ప్రభుత్వానికి కొంపేమి మునగదు కదా. బెట్టింగ్ రాయుడి పరామర్శకు రెంటపాళ్లకు వెళ్లి మూడు ప్రాణాలను బలితీసుకున్నారు. అక్కడ పోలీసులు భద్రత కల్పించలేదని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే సానుభూతి కోసం కోర్టుకు వెళుతున్నారు. ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుంచుకోండి. ఓ వైపు వాతావరణం అనుకూలంగా లేదని పర్యటన వాయిదా వేసుకుని మరోవైపు హైకోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

జైలు నుంచి వంశీ విడుదల

పవన్ కల్యాణ్‌పై కేసు.. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 02 , 2025 | 04:23 PM