Vamsi Released: జైలు నుంచి వంశీ విడుదల
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:05 PM
Vamsi Released: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్నారు.

విజయవాడ, జూలై 2: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Former MLA Vallabhaneni Vamsi) విడుదలయ్యారు. ఈరోజు (బుధవారం) విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని, తలశిల రఘురామ్ కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా.. వివిధ కేసుల్లో దాదాపు 137 రోజులుగా వంశీ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
కాగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ వంశీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై నాలుగు వారాల క్రితమే వాదనలు ముగియగా.. నిన్న (మంగళవారం) వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వంశీపై ఉన్న రెండు కేసుల్లో కూడా గత నెలలోనే ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా నకిలీ ఇళ్లపట్టాల కేసులో బెయిల్ రావడంతో ఈరోజు వంశీ జైలు నుంచి విడుదలయ్యారు.
మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై కేసు.. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News