CM Chandrababu Kuppam: బెంగళూరు నుంచి కుప్పంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:02 PM
CM Chandrababu Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు జరుగనున్నాయి.

చిత్తూరు, జులై 2: జిల్లాలో పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) బెంగళూరు నుంచి బయలుదేరారు. రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి. అలాగే కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. 1000 మంది దీపం పథకం లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. ఆపై శాంతిపురం మండలం తుంశీలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద బహిరంగ సభకు హాజరవుతారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
కుప్పం నియోజకవర్గం అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రూ.1617 కోట్ల విలువైన పెట్టుడులపై ఒప్పందాలు జరుగనున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్‌లను పరిశీలిస్తారు సీఎం. బహిరంగ సభ అనంతరం తిమ్మరాజుపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఆపై ముఖ్యమంత్రి నివాసం చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
రేపు (గురువారం) ఉదయం కుప్పం ఏరియా హాస్పిటల్ చేరుకొని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి స్వగృహం చేరుకొని అధికారిక సమీక్షలు నిర్వహించనున్నారు. కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుని బెంగళూరుకు సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు.
ఇవి కూడా చదవండి
Vamsi Released: జైలు నుంచి వంశీ విడుదల
Read latest AP News And Telugu News