Jogi Ramesh: జోగి రమేశ్‌ని విచారిస్తున్న పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి..!
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:33 PM
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్‌ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
విజయవాడ, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)లో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్ (Jogi Ramesh)ని ఇవాళ(ఆదివారం) ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్‌ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు. జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముని వేర్వేరుగా అధికారులు విచారించారు. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో ఏ18గా జోగి రమేశ్‌ని అధికారులు చేర్చనున్నారు. ఏ19గా జోగి సోదరుడు జోగి రాముని చేర్చనున్నారు అధికారులు. జనార్దన్‌తో ఉన్న సంబంధాలు, ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ ఇంటికి వచ్చి కలిసిన భేటీపై జోగి బ్రదర్స్‌ని అధికారులు ప్రశ్నించారు. అయితే, జోగి రాముకి, జనార్దన్‌కు మధ్య ఫైనాన్షియల్ లింకులపై వరుస ప్రశ్నలని అధికారులు సంధించారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేశ్‌ను, విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జోగి రమేశ్‌కి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
అలాగే, నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేశ్ ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. జోగి రమేశ్‌కి సంబంధించిన రెండు ఫోన్లు, ఆయన భార్య వాడిన మరో ఫోన్‌ని ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. జోగి రమేశ్ ఇంటి సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు. జోగి రమేశ్ ఇంట్లో క్లూస్ టీమ్ అధికారులు సోదాలు పూర్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో దారుణం.. మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రమాదం.. అయ్యప్ప స్వాములకి తీవ్రగాయాలు
Read Latest AP News And Telugu News