Home » Jogi Ramesh
విజయవాడ నకిలీ మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎనిమిది మంది నిందితులపై ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు నిందితుల పాత్రను ఛార్జిషీట్ లో సిట్ అధికారులు వివరించారు.
కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేశ్, జోగి రామ్మోహన్‌లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది.
జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది.
కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన బ్రదర్ రామును నెల్లూరు సెంట్రల్ జైలుకు పోలీసులు సోమవారం తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున న్యాయాధికారి రిమాండ్ విధించిన అనంతరం జోగి రమేశ్ ఆయన సోదరుడు రామును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఆస్పత్రి వద్ద జోగి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆస్పత్రి అద్దాలను జోగి అనుచరులు ధ్వంసం చేశారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్‌ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్ కి సెర్చ్ వారెంట్ అందచేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు జారీ చేశారు.