AP Liquor Case: కల్తీ మద్యం కేసులో సిట్ దూకుడు... జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు
ABN , Publish Date - Dec 01 , 2025 | 09:19 PM
కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేశ్, జోగి రామ్మోహన్‌లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
విజయవాడ, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): కల్తీ మద్యం కేసులో (AP Liquor Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేశ్, జోగి రామ్మోహన్‌లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఈనెల 3వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు సిట్ అధికారులు. కల్తీ మద్యం కేసులో ఇప్పటికే జోగి రమేశ్, జోగి రాములను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు జోగి బ్రదర్స్. తాజాగా జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని సిట్ అధికారులు భావించారు. అయితే, జోగి రమేశ్, రాము విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News