AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:27 PM
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో జోగి రమేష్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ2గా ఉన్న అద్దేపల్లి జగన్‌మోహన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే మొదటి నుంచి ఈ వ్యవహారం వెనుక జోగి రమేష్ ఉన్నారని, ఆయన సమక్షంలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై అధికారులు ఇప్పటికే అద్దేపల్లి బ్రదర్స్‌ను రెండు సార్లు విచారించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కామ్‌లో జోగి రమేష్ పాత్రపై జనార్దన్ రావు, జగన్‌మోహన్ రావు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఈ పరిణామల నేపథ్యంలో జోగి రమేష్‌ను 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన న్యాయస్థానం 4 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో జోగి రమేష్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జోగి రమేష్ నకిలీ మద్యం గురించి వార్తలను లీక్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. జోగి రమేష్ నకిలీ మద్యం తయారీకి ఆదేశించారని, ఆ సమాచారాన్ని వైసీపీ మీడియాకు లీక్ చేశారని అధికారులు నిర్ధారించారు. జోగి రమేష్ సూచనల మేరకే తాము నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు పోలీసుల ముందు అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి
ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే
Read Latest AP News And Telugu News