Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో.. జోగి రమేష్ అరెస్ట్..
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:35 AM
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్ కి సెర్చ్ వారెంట్ అందచేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు జారీ చేశారు.
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. ఎక్సైజ్ ఆఫీస్‌కు తరలించారు. కల్తీమద్యం కేసులో జనార్దనరావు స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్‌పై జోగి రమేష్ స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఇదిలాఉండగా, జోగి రమేశ్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంటి దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్దకు పోలీసులు ఉదయమే వెళ్లారు. ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. జోగి రమేష్ తనకు ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత పట్టించుకోలేదని జనార్ధన్ రావు అధికారులకు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం