Mithun Reddy: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:45 PM
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా మిథున్‌రెడ్డి ఉన్నారు.

విజయవాడ: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) లాయర్లు ఏసీబీ కోర్టులో ఇవాళ (గురువారం జులై 24) బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు మిథున్‌రెడ్డి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు.
కాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లని వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్‌రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల(జులై) 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు.. మద్యం ముడుపుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ నెల (జులై) 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రా గోల్డ్ బ్రాండ్ పేరిట భారీగా మద్యం తయారీ చేసినట్లు గుర్తించారు.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆంధ్రా గోల్డ్ బ్రాండ్ భారీగా కొనుగోళ్లు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇప్పటికే సిట్, ఈడీ అధికారులు మద్యం కేసుకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించారు. ఇక వరుసగా దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సిట్ ప్రిలిమినరీ చార్జిషీట్ వేయడంతో ఇక దర్యాప్తు ప్రారంభించాలని ఈడీ అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News