Kollu Ravindra: ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:18 PM
Kollu Ravindra: టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రతీ కార్యకర్తను గౌరవించుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచ్చలేని వ్యక్తిని అరెస్టు చేస్తే.. లోకేష్ పడిన బాధ చెప్పలేనిదన్నారు.

కృష్ణా, జూన్ 25: టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి.. కార్యకర్తలకు గౌరవం సాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. బుధవారం మచిలీపట్నం పర్యటనలో భాగంగా టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. కష్టపడిన వారిని పిలిచి పదవులిచ్చే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో మాత్రమే సాధ్యమన్నారు. పని చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రతీ కార్యకర్తను గౌరవించుకుంటామన్నారు. మచ్చలేని వ్యక్తిని అరెస్టు చేస్తే.. లోకేష్ పడిన బాధ చెప్పలేనిదన్నారు.
చంద్రబాబును అరెస్టు చేసినపుడు దేశం అంతా వ్యతిరేకించిందని చెప్పారు. న్యాయం గెలవాలి అంటూ భువనేశ్వరి చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. తనను హత్య కేసులో అరెస్టు చేస్తే అండగా నిలిచి తోడుగా నడిచిన కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచిన కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం ఇంత పెద్ద సభ నిర్వహించిన ఘనత టీడీపీలో మాత్రమే సాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
లోకేష్ రాకతో నూతనోత్సాహం: మంత్రి వాసం శెట్టి
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు కాదని కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతున్నారని తెలిపారు. కార్యకర్తలతో ఫోటో సెషన్ కూడా చేస్తున్నారన్నారు. యువగళం పేరుతో నారా లోకేష్ అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లారన్నారు. లోకేష్ మచిలీపట్నంలో కార్యకర్తలకు నూతనోత్సాహం కల్పించారని మంత్రి వాసంశెట్టి శుభాష్ అన్నారు.
కాగా.. ఈరోజు ఉదయం మచిలీపట్నం చేరుకున్న మంత్రి లోకేష్‌కు మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అలాగే అంతకుముందు రోడ్డు మార్గంలో మచిలీపట్నం బయలుదేరిన మంత్రికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజానీకం స్వాగతం పలికారు. లోకేష్‌కు స్వాగతం పలికిన వారిలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అటు మొవ్వ మండలం నిడుమోలు వద్ద మంత్రికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం స్వాగతం పలికారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం మంత్రి లోకేష్ కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి
సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి
ఫ్రెండ్స్‌ను కలుస్తానంటూ వెళ్లిన యువతి.. ఓయో లాడ్జ్‌లో
యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ.. డ్రగ్స్ నివారణ పోస్టర్లు విడుదల
Read latest AP News And Telugu News