Police Raid: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. వైసీపీ నేత అరెస్టు..
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:18 AM
Police Ride: విజయవాడ, గవర్నర్‌పేట అట్టా రత్తయ్య వీధిలోని వైసీపీ నాయకుడు కోసూరు మణికి చెందిన భవనంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వాసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ భవనంపై దాడి చేశారు.

Vijayawada: నగరంలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా (Prostitution racket) గుట్టును పోలీసులు (Police) రట్టు చేశారు. గవర్నర్ పేట అట్టా రత్తయ్య వీధిలో వైసీపీ నేత (YCP Leader) కోసూరు మణి (Kosuru Mani)కి చెందిన భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఆ భవనంపై దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నేత మణితో సహా ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు యువతులను వసతి గృహానికి తరలించారు.
ఇతర రాష్ట్రాల నుంచి యువతులు..
వైసీపీ నేత కోసూరి మణి మరికొందరితో కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీని కోసం చిన్నం రంగసాయినాథ్ తేజ, భుక్త్వా పూర్ణచంద్రరావు, అంగనూరి వంశీకృష్ణలను మణి పనిలో పెట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, వంటి రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ.. వారి శరీరాలను అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వైసీపీ నేత మణి ఆగడాలపై విజయవాడ సీపీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. కాగా గవర్నరుపేట సీఐ తన సిబ్బందితో వ్యభిచార గృహంపై దాడి చేశారు. మణితో పాటు, బాలకృష్ణ, సాయినాథ్ తేజ, పూర్ణచంద్రరావు, వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువతులకు డబ్బు ఆశ చూపించి..
యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించే వారని పోలీసులు చెబుతున్నారు. యువతుల ఫొటోలను ఆన్‌లైన్‌లో ఉంచి విటులను ఆకర్షించేవారని, ఫోన్‌లో సంప్రదించిన వారిని రహస్యంగా గవర్నర్‌పేట, అట్టా రత్తయ్య వీధిలోని శ్రీసాయి మణి లాడ్జికి తీసుకొచ్చేవారని తెలిపారు. అత్యంత రహస్యంగా జరుగుతున్న దీనిపై.. పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు గవర్నరుపేట సీఐ తన సిబ్బందితో దాడి చేశారు.
ఏ5గా వైసీపీ నేత...
ఈ కేసులో పోలీసులు మొత్తం అయిదుగురిని నిందితులుగా చేర్చారు. భవన యజమాని అయిన వైసీపీ నేత మణిని ఏ5గా చేర్చారు. అతనికి తెలిసే వ్యభిచారం జరుగుతోందని సీఐ నాగమురళి తెలిపారు. నిర్వాహకుడు బాలకృష్ణ ఏ1గా, చిన్నం రంగాసాయినాథ్ తేజ ఏ2, అంగలూరి వంశీకృష్ణ ఏ3, భూక్యా పూర్ణచంద్రరావు ఏ4గా కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి:
స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు..
సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..
For More AP News and Telugu News