Share News

CM Chandrababu: ఆ సమస్య అన్ని దేశాల్లో ఉంది

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:49 PM

విజయవాడ వేదికగా జరుగుతున్న ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu: ఆ సమస్య అన్ని దేశాల్లో ఉంది
AP CM Chandrababu

విజయవాడ, జూన్ 25: మొదట్లో బిజినెస్ పీపుల్‌తో రాజకీయ నాయకులు మాట్లాడే వారు కాదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తామంటే వెళ్లొదని.. అలా వెళ్లడం వల్ల ప్రజల్లో ఒక భావన ఏర్పడుతుందని వారు సూచించే వారని ఆయన పేర్కొన్నారు. అయినా తాను పలుమార్లు దావోస్‌కు వెళ్లానని.. పారిశ్రామికవేత్తతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించానని చెప్పారు. బుధవారం విజయవాడ నగరంలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నాటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రపంచీకరణ (globalization)కు అనుమతి ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడిందన్నారు. గత ప్రధాని పీవీ నరసింహారావు కంపల్షన్ వల్ల అలా చేశారని చెబుతున్నప్పటికీ.. దీని వల్ల దేశానికి మేలు జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నామన్నారు. ఫిక్కీ 100 ఏళ్లకుపైగా ఉన్న సంస్థ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌ బ్రౌన్‌ ఫీల్డ్‌ సిటీ అని.. రాజధాని అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ అని అభివర్ణించారు. రాజధాని అమరావతి అద్భుత నగరంగా మారబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


పాలనలో టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లో అందిస్తున్నామని వివరించారు. మూడు దశాబ్దాలుగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. హైటెక్‌ సిటీకి మైక్రోసాఫ్ట్‌ సహా పలు పెద్ద కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని దేశాల్లో యువత సమస్య ఉందన్నారు. ఊహించని విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. క్వాంటమ్‌ వ్యాలీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌‌లో ఉన్న అంశాలని ఆయన సోదాహరణగా వివరించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అద్భుతాలు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు కాంపిటేటివ్ ఎకానమీలో మనం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు వివరించారు.


అంతకు ముందు ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు ఫిక్కీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. అమలు చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ప్రశంసించారు. ఎంఎస్ఎంఈ (MSME)ల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఈ సందర్భంగా వారు అభినందించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు తమ వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వానికి ఫిక్కీ జాతీయ కార్యవర్గం హామీ ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సిట్ కస్టడీ.. జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పీఎస్‌కు కాకాణి

కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jun 25 , 2025 | 01:17 PM