Share News

Machilipatnam: కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:18 PM

Minister Lokesh: కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నం చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలుగు మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తల్లికి వందనం అమలు చేసినందుకు సంతోషంగా ఉందని మహిళలు ధన్యవాదాలు తెలిపారు.

Machilipatnam: కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
AP Minister Nara Lokesh

Krishna Dist: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం (Machilipatnam) చేరుకున్న ఆయనకు మంత్రి కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్‌, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్‌, వర్ల కుమార్‌ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్‌, పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు (Grand Welcome). హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించే ఉత్తమ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. అనంతరం కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అంతకుముందు రోడ్డు మార్గంలో మచిలీపట్నం బయలుదేరిన మంత్రి లోకేష్‌కు అడుగడుగునా పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజానీకం స్వాగతం పలికారు.


లోకేష్‌కు తెలుగు మహిళల హారతి..

మంత్రి లోకేష్‌కు తెలుగు మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తల్లికి వందనం అమలు చేసినందుకు సంతోషంగా ఉందని మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేశామని లోకేశ్‌ తెలిపారు. వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడారో చూశామన్నారు. మహిళలను గౌరవించే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంటుందన్నారు. త్వరలో పాఠశాలల్లో తల్లిదండ్రులు, టీచర్స్‌ మీటింగ్‌ పెడతామని చెప్పారు. సమాజంలో మార్పు రావాలని, మహిళలతో మాట్లాడే విధానం కూడా మారాలన్నారు. చట్టాలు, డబ్బులతో ఆ మార్పు రాదని అన్నారు. తన సతీమణి బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏం చేయలేనని అన్నారు. అలాగే తన తల్లి త్యాగం చేయకపోతే చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయలేరని అన్నారు. మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు

ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..:పవన్ కల్యాణ్

స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 25 , 2025 | 12:18 PM