Share News

Renu Desai: రాజకీయాలపై సినీనటి రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:30 PM

తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఇది సావిత్రిబాయిపూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చానని సినీ నటి రేణుదేశాయ్ అన్నారు. ఈరోజు మీ ముందు తాను మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సావిత్రిబాయిపూలే అని చెప్పారు.

Renu Desai: రాజకీయాలపై సినీనటి రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు
Renu Desai

విజయవాడ: మహిళల విద్య కోసం సావిత్రిబాయిపూలే ఎంతో కృషి చేశారని సినీనటి రేణుదేశాయ్ అన్నారు. విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ(శుక్రవారం) ఉత్తమ మహిళా ఉపాధ్యాయినులకు అవార్డుల ప్రధానోత్సవాలు జరిగాయి. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయినులకు సత్కరించారు. అతిథులకు ఆహ్వానం పేరుతో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయినులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు బ్రహ్మానందం, రేణుదేశాయ్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేణుదేశాయ్ మాట్లాడుతూ... తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. ఇది సావిత్రిబాయిపూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చానని అన్నారు. ఈరోజు మీ ముందు తాను మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సావిత్రిబాయిపూలే అని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రులు కంటే ఉపాధ్యాయులతోనే ఉంటారన్నారు.పిల్లలను సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని సినీ నటి రేణుదేశాయ్ తెలిపారు.


ఉపాధ్యాయులను గౌరవించాలి: సినీనటుడు బ్రహ్మానందం

Brahmanandam.jpg

ఉపాధ్యాయులను గౌరవించాలని సినీనటుడు బ్రహ్మానందం అన్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయునులను ఎంపిక చేసి అవార్డులు ఇస్తున్నారని చెప్పారు. బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలు గతంలో ఉండేవని.. అనేక మూఢనమ్మకాలు కొన్నేళ్ల క్రితం ఎక్కువగా ఉండేవని చెప్పారు. ఇప్పటికీ స్త్రీలు తక్కువ అనే భావన ఉందని అన్నారు. సావిత్రిబాయిపూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. మహిళల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి సావిత్రిబాయిపూలే అని చెప్పారు. మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే వయస్సు పెరుగుతుందన్నారు. కులమతాలు అన్నీ మనం కల్పించుకున్నవేనని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల కోసం కులమతాలను కొందరూ ఉపయోగించుకుంటున్నారని అన్నారు. తానూ ఎప్పటికీ ఉపాధ్యాయుడునే అని బ్రహ్మానందం తెలిపారు.


సావిత్రిబాయిపూలే మహిళా విద్యకోసం ఎంతో కృషి చేశారు: బోడే రామచంద్రయాదవ్

Ramachandra-Yadav.jpg

సావిత్రిబాయిపూలే అణగారిన వర్గాలు, మహిళల కోసం ఎన్నో త్యాగాలు చేశారని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ తెలిపారు. మహిళా విద్యకోసం ఎంతో కృషి చేశారన్నారు. దురాచారాలు మీద ఎన్నో విధాలుగా పోరాడారు, ఈ క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా ఉత్తమ ఉపాధ్యాయులను ఇక్కడికి తీసుకుని వచ్చి అవార్డులు ఇస్తున్నామని చెప్పారు. సావిత్రిబాయిపూలే జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. సావిత్రిబాయిపూలే జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బోడే రామచంద్రయాదవ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Govt: ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్.. లక్ష్యం ఇదే

DK Aruna: సీఎం చంద్రబాబుపై డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Atchannaidu: జగన్‌వి అన్నీ ప్రగల్భాలే.. రాష్ట్రాన్ని భష్టు పట్టించారు.. అచ్చెన్న ఫైర్

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 04 , 2025 | 01:31 AM