Devineni Uma: అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం.. జగన్ అండ్ కోకు దేవినేని ఉమ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Aug 18 , 2025 | 07:00 PM
ఏపీ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2 పథకాలతో పాటు విద్య పథకాల ద్వారా కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణే జగన్ అసహనానికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఇలాంటి సంక్షమ పథకాలను చూసి జగన్ అండ్ కో ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. మహిళల ఖాతాల్లో డబ్బులు పడుతుండటాన్ని తట్టుకోలేక అసహనంతో ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి , ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో రూ.52 వేల కోట్లతో జరుగుతున్ననిర్మాణాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడో వాగులు పొంగిన దృశ్యాలను అమరావతితో కలిపి బ్లూ మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజ్, కొండవీటి వాగు అంశంపై వైసీపీ విష ప్రచారం చేయడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారని తెలిపారు దేవినేని ఉమామహేశ్వరరావు.
ఇవాళ(సోమవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ధైర్యం ఉంటే అమరావతి వచ్చి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చూసి వెళ్లాలని జగన్ అండ్ కోకు సవాల్ విసిరారు. అమరావతి రైతులపై దమనకాండ, కేసులు, జైలుశిక్షలు – పనులు ఆపేసి మూడు రాజధానుల మాయాజాలం అంటూ వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తీర్పుతో వైసీపీ 11 సీట్లకు పరిమితమై, తాజాగా పులివెందుల, ఒంటిమిట్టలో పరాభవం చవిచూసిందని ఎద్దేవా చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు.
ఏపీవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2 పథకాలతో పాటు విద్య పథకాల ద్వారా కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణే జగన్ అసహనానికి కారణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాలను చూసి జగన్ అండ్ కో ఓర్వలేక పోతున్నారని దుయ్యబట్టారు. మహిళల ఖాతాల్లో డబ్బులు పడుతుండటాన్ని తట్టుకోలేక అసహనంతో ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశమంతా అమరవీరులను స్మరించిన వేళ మాజీ సీఎం అయి ఉండి తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ రెడ్డి తలదాచుకున్నారని సెటైర్లు గుప్పించారు. అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం టీడీపీ నేతలుగా తమ బాధ్యత అని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కాకాణి గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
కేంద్రమంత్రులతో నారా లోకేష్ భేటీ.. ఎందుకంటే..
Read Latest AP News And Telugu News