Cyber Crime: మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు మోసం..
ABN , Publish Date - Oct 30 , 2025 | 09:41 AM
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడ: మంత్రి నారా లోకేశ్ పేరిట రూ.54 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. లోకేశ్ ఫొటో ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడ్డారు. సీఐడీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టీడీపీ ఎన్.అర్.ఐ కన్వీనర్ అంటూ మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. వాట్సాప్ డీపీ నారా లోకేశ్ ది ఉండటంతో బాధితులు కూడా నిజమని నమ్మినట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్ కోసం ఎదురుచూస్తున్న బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మెడికల్ హెల్ప్ కోసం ఎదురుచూస్తున్న బాధితులకు పది లక్షల రూపాయలు వీత్ డ్రాకి అనుమతి వచ్చింది అంటూ.. ట్యాక్స్‌లు పేరిట బాధితుల వద్ద నుంచి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. 9 మంది బాధితుల నుంచి సుమారు.. రూ.54 లక్షలు కాజేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ చేపట్టి రాజేష్, సాయి శ్రీనాథ్, సురేంద్రలను నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజేష్‌ను గతంలో కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కోర్టు ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు
Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు