Share News

Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఆస్పత్రికి చెవిరెడ్డి.. ఏమైందంటే

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:32 PM

Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో పోలీసు అధికారులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Chevireddy Bhaskar Reddy: విజయవాడ ఆస్పత్రికి చెవిరెడ్డి.. ఏమైందంటే
Chevireddy Bhaskar Reddy

విజయవాడ, జూన్ 21: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Former MLA Chevireddy Bhaskar Reddy) అస్వస్థతకు గురయ్యారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆయన జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అయితే ఈరోజు (శనివారం) ఉదయం గుండెలో నొప్పిగా ఉందని‌ చెప్పడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా జైలులో ఉన్న వైద్యులతో పరీక్షలు చేయించారు. ఆపై ముందస్తు జాగ్రత్తగా ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి.


ఈరోజు సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలోనే మాజీ ఎమ్మెల్యే ఉండనున్నారు. అయితే ప్రాణాపాయం ఏమీ లేదని.. సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచి మందులు ఇచ్చి పంపిస్తామని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఈరోజు సాయంత్రానికి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని అధికారులు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి నిన్న (శుక్రవారం) విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. చెవిరెడ్డిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.


మరోవైపు అదే సమయంలో చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. అలాగే తనకు జైలు భోజనం పడటం లేదని ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటికి సంబంధించి సోమవారం (ఈనెల 23) విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది.


ఇవి కూడా చదవండి

సరికొత్త చరిత్ర.. యోగా డేపై సీఎం చంద్రబాబు

యోగా గ్రాండ్ సక్సెస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

సిట్‌ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యా‌ప్‌పైనే విచారణ

Read latest AP News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 02:33 PM