Yoga Day in Visakhapatnam: గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..
ABN , Publish Date - Jun 21 , 2025 | 08:26 AM
దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో కూడా యోగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక, విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో జరుగుతోంది.

దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day) ఘనంగా జరుపుతున్నారు. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లో కూడా యోగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక, విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంతో విశాఖపట్నం రామకృష్ణ బీచ్ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేస్తున్నారు (Yoga Day in Visakhapatnam).
విశాఖపట్నంలో జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (Guinness Record) స్థానం దక్కించుకుంది. ఒకేసారి మూడు లక్షల మంది ప్రజలు ఆసనాలు వేయడం ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు సూరత్‌లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డ్ సృష్టించారు. ఆ రికార్డును తాజాగా విశాఖ యోగాంధ్ర కార్యక్రమం దాటేసింది. దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోబోతోంది. సూరత్ రికార్డ్‌ను అధిగమించడడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిరిజన విద్యార్థులు గిన్నిస్ రికార్డు సృష్టించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి జిల్లాలోని 106 పాఠశాలలకు చెందిన 25వేల మంది విద్యార్థులు పాల్గొని 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు పర్యవేక్షించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం క్లిక్ చేయండి..