Share News

Yoga Day Vizag: యోగాను 130 దేశాల్లో జరుపుకుంటున్నాం..పోస్టల్ స్టాంపుల విడుదల

ABN , Publish Date - Jun 21 , 2025 | 07:27 AM

విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yoga Day Vizag) ఘనంగా ప్రారంభమైంది. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దీనిని 130 దేశాల్లో జరుపుకుంటున్నట్లు తెలిపారు.

Yoga Day Vizag: యోగాను 130 దేశాల్లో జరుపుకుంటున్నాం..పోస్టల్ స్టాంపుల విడుదల
Yoga Day Vizag

విశాఖ: ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) విశాఖపట్నంలో (Yoga Day Vizag) ఘనంగా మొదలైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) యోగా డేను 130 దేశాల్లో జరుపుకుంటున్నామని తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని ఆయన అన్నారు. మోదీ గత పదేళ్లుగా యోగాను ప్రోత్సహిస్తున్నారని, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదన్నారు. ఇది క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుందని చెప్పారు.


ఈ కార్యక్రమంలో భాగంగా సూర్య నమస్కారాలతో గిరిజన విద్యార్థులు రికార్డు సాధించినట్లు ఆయన వెల్లడించారు. యోగా అన్ని క్రీడల్లో భాగం కావాలని ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంపులను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు కలిసి విడుదల చేశారు.


మోదీ ఏమన్నారంటే..

ప్రధాని మోదీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా ప్రపంచాన్ని కలిపిందని, 175కుపైగా దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని గుర్తు చేశారు. ఇది మనతోనే సాధ్యమైందని అన్నారు. యోగా ద్వారా కోట్ల మంది జీవనశైలి మారిపోయిందని వెల్లడించారు. నేవీ నౌకల్లో కూడా యోగాసనాలు చేస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ సందర్భంగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు.


పవన్ కల్యాణ్

యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే, మోదీ విశ్వవ్యాప్తంగా యోగాను ప్రోత్సహించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే భారతావనికి దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్న పవన్, యోగాను అందించిన ఆదియోగి, పతంజలికి నమస్కారాలు తెలియజేశారు. యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 12:27 PM