Yoga Day CM Chandrababu: యోగా గ్రాండ్ సక్సెస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:22 PM
Yoga Day CM Chandrababu: యోగా డే సందర్భంగా పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు.

విశాఖపట్నం, జూన్ 21: యోగాడే నిర్వహణ, గ్రాండ్ సక్సెస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. ఈరోజు (శనివారం) విశాఖ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం రివ్యూ చేపట్టారు. సమావేశ మందిరంలోకి సీఎం చంద్రబాబుకు కరతాళధ్వనులతో మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. విశాఖతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే జరిగిన తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రపంచ రికార్డుల సాధనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగులు, అధికారులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం, అన్నివిభాగాల సమన్వయంతో యోగా డే గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్నారు ముఖ్యమంత్రి.
మంచి కార్యక్రమంలో ఇదో గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యత తీసుకుని పనిచేసిన తీరుకు అభినందనలు తెలిపారు. అర్థరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలిరావడం ఆశ్య్చర్యాన్ని కలిగించిందని కొందరు అధికారులు తెలిపారు. విశాఖ యోగా డేలో 3 లక్షల మందికి పైగా యోగా సాధనలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. పాల్గొన్నవారి లెక్కింపులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం తిరుగులేని ఫలితాన్ని ఇచ్చిందని మంత్రులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సిట్ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యాప్‌పైనే విచారణ
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
Read latest AP News And Telugu News