Share News

Perni Nani: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:50 PM

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Perni Nani: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నానిపై మరో కేసు
Perni Nani Case

విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై (Perni Nani Case) విజయవాడలో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనార్టీ నాయకులు తావుల్లా, ఆషాలు.. విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేర్ని నానిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాలని మైనార్టీ నేతలు కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైగా చేస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్తంభానికి కట్టేసి పేర్ని నానిని కొడతామని ఫతావుల్లా, ఆషాలు హెచ్చరించారు. ఇంకోసారి రెచ్చగొట్టే మాటలు పేర్ని నాని మాట్లాడకుండా గుణపాఠం చెబుతామని మైనార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు.


మాజీ మంత్రి పేర్ని నానికి పీతల సుజాత స్ట్రాంగ్ వార్నింగ్..

peetala-sujatha.jpg

కాగా.. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పేర్నినానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్మన్ పీతల సుజాత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరులో పీతల సుజాత ఇవాళ(ఆదివారం) పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. జగన్ ఇచ్చే బిస్కట్ల కోసం పేర్ని నాని నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేయాలని పేర్ని నాని మాట్లాడిన ఆడియో కాల్‌ను ప్రజలందరూ గమనించారని చెప్పుకొచ్చారు పీతల సుజాత.


ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి, 11 సీట్లు వచ్చేసరికి ఆ పార్టీ నేతలకి మతిపోయి, ఏం చేస్తున్నారో తెలియడం లేదని పీతల సుజాత ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి చెందడం వైసీపీ నేతలకి ఇష్టం లేకపోవడంతోనే విద్వేషాలని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జగన్‌‌కు, వైసీపీకి ఇష్టం లేదని విమర్శించారు. కన్నుకొడితే రాత్రికి రాత్రే రప్పా రప్పా చంపేయాలని పేర్ని నాని అంటున్నారని.. మీరు రప్పా రప్పా చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదని హెచ్చరించారు. ఇది కూటమి ప్రభుత్వమని.. మీ ఇష్టం వచ్చిన పనులు చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. లాజిక్‌లు మాట్లాడితే తెలివైన వాడినని పేర్ని నాని అనుకుంటున్నారని అన్నారు. పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలని పీతల సుజాత కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ

For More AP News and Telugu News

Updated Date - Jul 13 , 2025 | 04:13 PM