Home » Case
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్‌కుమార్‌ల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేయించానని సిట్ అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును సిట్ అధికారులు మరోసారి విచారించారు. ఈ కేసులో అరెస్టయి, బెయిల్ మీదున్న ఆయన్ను శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు రెండో రోజున సిట్ అధికారుల ముందు హజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి వచ్చి ఆయన.. విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8గంటల ప్రాంతంలో తిరిగివెళ్లారు.
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, అత్యధికంగా కేరళలో 1,679 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత స్థానంలో గుజరాత్ (615), పశ్చిమబెంగాల్ (596), ఢిల్లీ (592) ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు మరణించగా.. కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్లపై కేసు నమోదైంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆయన ఇండియాకు వస్తున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.