AP liquor scam: సిట్ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గైర్హాజరు
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:04 PM
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.

Vijayawada: ఏపీ మద్యం కుంభకోణం (AP liquor scam) కేసు (Case)లో సిట్ అధికారులు (SIT Officers) దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి.. వారిని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో బుధవారం సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సిట్ విచారణకు మోహిత్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు హాజరు కావటానికి మూడు రోజుల సమయం కావాలని కోరారు. ఈ కేసులో ఆయన ఏ-39గా ఉన్నారు. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే ఏసీబీ కోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈరోజు ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది.
ఈ కేసులో తండ్రీ కొడుకుల పాత్ర...
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని బినామీగా చెప్పుకుంటున్న వెంకటేశ్ నాయుడును సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారి పాత్ర ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు నిర్ధారిస్తూ కోర్టుకు నివేదికను సమర్పించారు. చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలోనే అతడి కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఏ39గా ఇందులో చేర్చారు. మద్యం కుంభకోణం కేసులో తండ్రీ కొడుకుల పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ముందస్తు బెయిల్ కోసం గత శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు.
డబ్బులు ఏ విధంగా చేరాయి..
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మోహిత్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారానే మొత్తం మద్యం కుంభకోణం వ్యవహారం నడిచిందని ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహిత్ రెడ్డి పోటీ చేసిన నేపథ్యంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా డబ్బులను తీసుకున్నారని, అందులో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు నిర్ధారించారు. దాదాపు రూ. 250 కోట్లను మధ్యవర్తుల ద్వారా జిల్లాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నట్లు సెట్ అధికారులు ఆధారాలు సేకరించారు. మోహిత్ రెడ్డికి కూడా డబ్బులు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బులు ఏ విధంగా చేరాయి.. ఎవరి ద్వారా డబ్బులు వచ్చాయి.. ఏ విధంగా పంపిణీ చేశారనే విషయాలపై మోహిత్ రెడ్డిని విచారించాలని సిట్ భావిస్తోంది. దీంతో మోహిత్ రెడ్డి నుంచి సమాచారం రాబట్టేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
కృష్ణా జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు
ఎమర్జెన్సీ అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి..:పవన్ కల్యాణ్
For More AP News and Telugu News