Home » Chevireddy Mohith Reddy
మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
లిక్కర్ కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నోటీసును వైసీపీ యువనేత బేఖాతరు చేశారు. మద్యం ముడుపుల సొమ్మును తరలించారని, చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఖర్చు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(ఏ-39) సిట్ విచారణకు డుమ్మా కొట్టారు.
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బుధవారం విచారణకు రావాలంటూ చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ఈ రోజు విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఈ కేసులో మోహిత్ రెడ్డి ఏ-39గా ఉన్న విషయం తెలిసిందే.
Chevireddy Mohith Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి మోహత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు.. ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తిరుపతి జిల్లాలో జరిగిన దాడులు అన్ని ఇన్ని కావు. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని (Pulivarthi Nani)పై.. వైసీపీ నుంచి బరిలోకి దిగిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడి కార్లను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం చేశారు.
తిరుపతి: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు, మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి శనివారం రాత్రి బెంగళూరులో అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో తిరుపతి పోలీసులు ఎస్‌వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. పులివర్తి నానిపై దాడి కేసులో విచారణకు పిలిచినా మోహిత్ రెడ్డి సహకరించడం లేదు.
తిరుపతి: తన కుమారుడు మోహిత్ రెడ్డి వయస్సు 25 ఏళ్లు అని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని, సంఘటన జరిగిన 52 రోజుల తర్వాత రాజకీయ కక్షతో తన కుమారుడిపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..