Share News

YSRCP Chevireddy Mohith Reddy: మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:58 AM

మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.

YSRCP Chevireddy Mohith Reddy:  మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణను జూలై 2కి వాయిదా వేసింది. తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను నిలువరించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్‌ కోసం విజయవాడ కోర్టులో పిటిషన్‌ వేసినందున ఈ విషయాన్ని అక్కడే తేల్చుకోవాలది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులిచ్చారు.

Updated Date - Jun 28 , 2025 | 05:58 AM