Share News

YCP Mohith Reddy: సిట్‌ విచారణకు మోహిత్‌రెడ్డి డుమ్మా

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:10 AM

లిక్కర్‌ కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నోటీసును వైసీపీ యువనేత బేఖాతరు చేశారు. మద్యం ముడుపుల సొమ్మును తరలించారని, చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఖర్చు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి(ఏ-39) సిట్‌ విచారణకు డుమ్మా కొట్టారు.

YCP Mohith Reddy: సిట్‌ విచారణకు మోహిత్‌రెడ్డి డుమ్మా

  • ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నోటీసును వైసీపీ యువనేత బేఖాతరు చేశారు. మద్యం ముడుపుల సొమ్మును తరలించారని, చంద్రగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఖర్చు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి(ఏ-39) సిట్‌ విచారణకు డుమ్మా కొట్టారు. విజయవాడలోని సిట్‌ కార్యాలయం(సీపీ ఆఫీ్‌స)లో బుధవారం విచారణకు హాజరు కావాలంటూ ఇటీవలే దర్యాప్తు అధికారులు నోటీసులిచ్చారు. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించిన మోహిత్‌ రెడ్డి విచారణకు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. న్యాయస్థానంలో ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశిస్తుంటే... నిందితుని ఆచూకీ కోసం సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 10:32 AM