Share News

YS Sharmila: హ్యాపీ బర్త్‌డే అమ్మా.. విజయలక్ష్మికి షర్మిల శుభాకాంక్షలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:09 PM

YS Sharmila: వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయలక్ష్మి ఆయురారోగ్యాలతో ఉండాలని షర్మిల కోరుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.

YS Sharmila: హ్యాపీ బర్త్‌డే అమ్మా.. విజయలక్ష్మికి  షర్మిల శుభాకాంక్షలు
YS Sharmila wished Vijayamma

అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన తల్లి విజయలక్ష్మి 69వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షర్మిల భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. ‘నాకు జన్మనిచ్చి.. నా జన్మకు సార్థకత చేసేలా.. ఎల్లప్పుడు అండగా ఉంటున్నారు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అమ్మా.. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని షర్మిల పోస్ట్ చేశారు.


కానీ, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇటు పలువురు రాజకీయ నేతలు, వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న వారు కూడా విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెబుతున్నారు. వైఎస్ అభిమానులు కూడా విజయలక్ష్మికి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం

Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం

Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 02:25 PM