Share News

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:46 PM

మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితులు శుక్రవారం ఏసీబీ కోర్టు‌లో హాజరయ్యారు. తమకు బెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా 12 మంది నిందితులకు ఈనెల13వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.

 AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు
AP Liquor Scam

విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) 12 మంది నిందితులు ఇవాళ(శుక్రవారం) విజయవాడ ఏసీబీ కోర్టు‌లో (Vijayawada ACB Court) హాజరయ్యారు. తమకు బెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. 12 మంది నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా నిందితులకి ఈనెల(ఆగస్టు)13 తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. కోర్టు విచారణ అనంతరం రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి కేంద్రకారాగారానికి తరలించారు. బాలాజీ, నవీన్‌లను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మిగిలిన తొమ్మిది మంది నిందితులని విజయవాడ జిల్లా జైలుకి పోలీసులు తరలించారు.


అయితే, లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లని ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఏ35 బాలాజీ యాదవ్, ఏ36 నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్లని ఈ నెల 7వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.


మరోవైపు, ఏసీబీ కోర్టులో బాలాజీ గోవిందప్ప మెమో ఫైల్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ33గా ఉన్నారు బాలాజీ గోవిందప్ప. సిట్ దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌ట్యాప్, ల్యాబ్‌కు పంపాలని లేదా తమకు వెనక్కు ఇవ్వాలని మెమోలో తెలిపారు. సిట్ అధికారుల దగ్గర ఉంటే అందులో కంటెంట్ ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని మెమోలో బాలాజీ గోవిందప్ప పేర్కొన్నారు.


న్యాయం గెలుస్తుంది: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఏసీబీ కోర్టు‌ నుంచి జైలుకి తరలించే క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. మద్యాన్ని చిన్నప్పటి నుంచి ద్వేషించిన వ్యక్తిని తానని చెప్పుకొచ్చారు. మద్యం కారణంగా తన కుటుంబంలో ఇద్దరిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది 163 మంది విద్యార్థులను వేద పాఠశాలలో తాను చదివిస్తున్నానని గుర్తుచేశారు. అలాంటి తాను మద్యం జోలికి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయకపోయినా తనపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. అన్నింటికి దేవుడు ఉన్నారని...చూస్తూ ఉంటారని తెలిపారు. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం గెలుస్తుందని ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్

జగన్ పర్యటన.. కేసులు నమోదు

For More AP News and Telugu News

Updated Date - Aug 01 , 2025 | 06:07 PM