AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:57 PM
శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ల ఆధ్వర్యంలో 2025 నుంచి 2026కు ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలను ఇవాళ(శనివారం జులై 26) రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt) ఏర్పాటు చేసింది. ఒక్కో కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులని నియమించింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. బీద రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్ల కుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీ, మిర్యాల శిరీష దేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ, గౌరు చరిత అధ్యక్షతన మహిళ, శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ, తోట త్రిమూర్తులు అధ్యక్షతన సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేశారు.
శాసనమండలి చైర్మన్ మోషేనురాజు అధ్యక్షతన సభా నియామాల కమిటీ, తెలుగు భాష-సంస్కృతి అభివృద్ధి కమిటీ, జకియా కానమ్ నేతృత్వంలో అర్జీల కమిటీ, రవీంద్రబాబు నేతృత్వంలో సభా సమక్షంలో ఉంచే పత్రాల కమిటీ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అధ్యక్షతన నైతిక విలువల కమిటీ, బీటీ నాయుడు అధ్యక్షతన విశేషాధికారాల కమిటీ, ఇసాక్ బాషా అధ్యక్షతన ప్రభుత్వ హామీల కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News