AP GOVT: గుడ్‌న్యూస్.. ఆ జిల్లా ప్రజల కోరిక నెరవేర్చనున్న కూటమి సర్కార్
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:28 PM
Pemmasani Chandrasekhar: గుంటూరు అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. శంకర్ విలాస్ బ్రిడ్జిని అధునాతనంగా నిర్మించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి.

గుంటూరు జిల్లా: గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోవడంతో శంకర్ విలాస్ బ్రిడ్జిని ఆధునీకరణ చేయబోతున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.1958లో కట్టిన శంకర్ విలాస్ బ్రిడ్జి శిథిలావస్థకు వచ్చిందని అన్నారు. నందివెలుగు బ్రిడ్జి అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం 2014లో మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) శంకర్ విలాస్ పై వంతెన కోసం భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం పంపిణీ చేశారు. గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.
బ్రిడ్జిపై అపోహలు..
ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. కేవలం 6 నెలల వ్యవధిలో శంకర్ విలాస్ బ్రిడ్జి అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని అన్నారు. బ్రిడ్జిపై కొంతమంది అపోహలు కలిగిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఎవరూ అలాంటి అపోహలు నమ్మకుండా వాస్తవాలు ఆలోచించాలని అన్నారు. నష్టపోయిన యజమానులకు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందని తెలిపారు. ముందుగా ఆర్యూబీ కట్టాలంటే మళ్లీ మొదటి నుంచి చేయాలని.. అప్పుడు ఆర్వోబి ఆగిపోతుందన్నారు. భవిష్యత్తులో ఆర్వోబీ కావాలంటే అప్పుడు ఉన్న పరిస్థితికి అనుగుణంగా నిర్మించుకోవచ్చని సూచించారు. బ్రిడ్జి పొడవు పెంచితే వ్యాపారాలు దెబ్బతింటాయని అన్నారు. కూటమి నాయకులు సొంత లాభం కోసం పని చేయడం లేదని.. ప్రజల అభివృద్ధి తమకు లక్ష్యమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
వ్యాపారులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు: గల్లా మాధవి
శంకర్ విలాస్ పై వంతెన డిమాండ్ చాలా ఏళ్ల నుంచి ఉందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎట్టకేలకు పై వంతెన నిర్మాణం సాకారం కానుందని అన్నారు. ఈ సమయంలో కొందరు అడ్డంకులు సృష్టించడం సరికాదని చెప్పారు. వ్యాపారులను రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి విషయంలో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. రెండేళ్ల లోపు పై వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు.
ఆ కేసులు ఉపసంహరించుకోవాలి: రామాంజనేయులు
ప్రజలకు ఉపయోగపడే వంతెనను అడ్డుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కోర్టుకు వెళ్లిన వారు కూడా వంతెన నిర్మాణం కోసం సహకరించాలని కోరారు. లక్షల మందికి ఉపయోగపడే పని జరుగుతున్నప్పుడు వ్యాపారులు సహకరించాలని అన్నారు. పెద్ద ప్రాజెక్టు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవని అన్నారు. భవిష్యత్తులో జరిగే ప్రయోజనం దృష్ట్యా పై వంతెనకు సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణానికి ముందే పరిహారం, టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని తెలిపారు. కోర్టు కేసులు ఉపసంహరించుకోవాలని వ్యాపారాలకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
MP Kalisetti: జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.. టీడీపీ ఎంపీ విసుర్లు
Gujarath Tour: గుజరాత్‌లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన
YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు
Birthday Celebrations: అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
For More AP News and Telugu News