PM Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై మంత్రి మండలి భేటీ
ABN , Publish Date - Apr 21 , 2025 | 02:10 PM
Ministers meet: ప్రధాని మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి మంత్రి మండలి సోమవారం నాడు భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు.

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ రాజధాని అమరావతిలో మే2వ తేదీన పర్యటించనున్నారు. అమరావతిలో పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశం ఇవాళ (సోమవారం) జరుగనుంది. మరికాసేపట్లో మంత్రులు సమావేశం కానున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలతో రావాల్సిందిగా అధికారులకు మంత్రులు ఆదేశించారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్ ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
కేంద్రమంత్రులను కలవనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు(మంగళవారం) ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్థరాత్రి 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన వన్ జన్ పథ్‌కు వెళ్లి బస చేస్తారు. 22వ తేదీ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై వారితో చర్చిస్తారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో పాటు, జలవనరుల శాఖామంత్రి, న్యాయ శాఖా మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
MP Kalisetti: జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.. టీడీపీ ఎంపీ విసుర్లు
Gujarath Tour: గుజరాత్‌లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన
YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు
Birthday Celebrations: అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
For More AP News and Telugu News